రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీ పై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లారు మహిళా జర్నలిస్టులు. ఆ మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది వారిని చుట్టు ముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీకార్డులు లాక్కున్నారు.
ఇక ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరాక కూడా వారిపై వేధింపులు ఆగలేదు. పోలీస్ స్టేషన్‌లోనే ఒకరు జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినప్పటికీ పోలీసులు చోద్యం చూశారు. తాజాగా ఈ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మీరు ఎక్కడికిబడితే అక్కడికి పోయి ఇష్టం వచ్చినట్లు అలా చేస్తానంటే నేచురల్ రియాక్షన్ ఉంటది అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొంత మంది జర్నలిస్టులు సీఎం తీరుపై మండిపడుతున్నారు.