ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఆటోల బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ నాయకులు ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా మీటర్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. కాగా తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 6గ్యారెంటీ హామీలలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం విధితమే. ఈ తరుణంలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా డిసెంబర్ 09 నుంచి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటివరకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకే మొగ్గు చూపుతున్నారు. ఈతరుణంలోనే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు ఉద్యమం చేస్తున్నారు.