నారా లోకేశ్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వాక్యాలు చేశారు. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అలా ప్రకటించకూడదన్నారు. ‘బలం ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ తీసుకునేవాళ్ళం అవలేకపోతున్నాం.
ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం. కానీ విడదీయడం తేలిక. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని స్థానాలు వస్తాయి. కానీ అధికారంలోకి వస్తామో లేదో తెలియదు’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీతో పొత్తులో భాగంగా మూడోవంతు సీట్లు తీసుకుంటున్నామని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోవడం లేదని, భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడిన తాను పట్టించుకోలేదని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని చెప్పారు.