బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై గొడ్డలితో దాడికి యత్నం

-

సూర్యపేట బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై గొడ్డలితో దాడికి యత్నం జరిగింది. గొడ్డళ్లు, కత్తులతో వట్టే జానయ్య యాదవ్ పై కొంతమంది దాడికి దిగారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ప్రచారానికి వెళ్ళారు. ప్రత్యార్థులు జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. అయితే.. తృటిలో జానయ్యకు ప్రమాదం తప్పింది.

Ax attack on BSP candidate Vatti Janaiah Yadav's team
Ax attack on BSP candidate Vatti Janaiah Yadav’s team

ఈ సంఘటనలో బిఎస్పి కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంత్రి జగధీశ్వర్‌ రెడ్డి బంధువే గొడవకు కారణం అంటూ సమాచారం అందుతోంది. అయితే.. ఈ సంఘటన జరుగడంతో… గట్టికల్ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సూర్యాపేట, ఆత్మకూరు మం. లో గట్టికల్లులో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు బీయస్పీ అభ్యర్థి వట్టి జానయ్య యాదవ్ బృందం పై గొడ్డలితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ ట్వీట్‌ చేశారు. జానయ్య తృటిలో తప్పించుకొన్నారని పేర్కొన్నారు.

https://x.com/VatteJanaiah/status/1726285976367137077?s=20

Read more RELATED
Recommended to you

Latest news