రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇంటికో ఉద్యోగం పేరుతో గతంలో చేసిన మోసం మళ్లీ చేయనున్నారని ఆరోపించారు. మోసం చేసే కేసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకుందామని దొరల కోసం కాదన్నారు. టిఆర్ఎస్ బిజెపితో చేతులు కలిపి బిజెపికి బీ టీమ్ మాదిరిగా పనిచేస్తుందని ఆరోపించారు భట్టి విక్రమార్క.
ఎంఐఎంఈ టీముకి వంత పలుకుతుందన్నారు. టిఆర్ఎస్కు ఓటు వేయడం బిజెపికి వేయడమే అని పేర్కొన్నారు. కేంద్రము రాష్ట్రము రెండింటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలుకొని పనిచేస్తున్నారని.. ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నగర భూములను అమ్మేసుకున్నారని బట్టి విక్రమార్క ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఆరు గ్యారంటీ స్కీములను ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారు. జాతీయ పార్టీగా జాతీయస్థాయిలో కూటమిగా ఉన్న పార్టీలతో చర్చలు సాగుతున్నాయి అన్నారు. లెఫ్ట్ పార్టీలతో కలిసి పోవడం కోసం చర్చలు సాగుతున్నాయని లెఫ్ట్ పార్టీ అధిష్టానంతో చర్చలు చేస్తుందన్నారు. అభ్యర్థుల ప్రకటన నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ప్రకటన చేస్తుందన్నారు. విద్యార్థులపై సంపూర్ణ కసరత్తు జరుగుతుందని పద్ధతి ప్రకారం ఇప్పటికే అభ్యర్థుల ప్రక్రియ పూర్తయింది అన్నారు. ప్రకటన తరువాత త్వరలోనే జరుగుతుందని చెప్పారు భట్టి విక్రమార్క.