గడ్డం దురద బాధిస్తుందా..? ఈ చిట్కాలను ట్రై చేయండి అబ్బాయిలూ..!

-

ఈరోజుల్లో అబ్బాయిలు గడ్డం, హెయిర్‌ స్టైల్‌ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇవి రెండూ నీట్‌గా, స్టైల్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలకు కూడా వాళ్ల తల్లిదండ్రులే స్ట్రైక్‌ తీయిస్తున్నారు.. దాంతో ఆ బుడ్డోడు మస్త్‌ స్ట్రైల్‌గా కనిపిస్తాడు.. ఒకప్పుడు డిప్ప కటింగ్‌లు వేసుకోని తలకు ఇంతింత ఆయిల్‌ రాసుకుని స్కూల్‌కు వెళ్లేవాళ్లు.. ఇప్పుడు ఎవరూ అలా ఉండటంలేదు..పిల్లల్లోనే అంత మార్పు వస్తే.. ఇక పెద్దోళ్లు మారకుండా ఉంటారా..ఆ గడ్డాన్ని పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ గడ్డం పెంచుతున్నారు. అయితే గడ్డంతో ఒక సమస్య ఉంది..
అమ్మాయిలకు ఎంత జుట్టు ఉన్నా పెద్దగా సమస్య ఉండదు కానీ.. అబ్బాయిలకు ముఖం మీద గడ్డం పెరిగే కొద్ది కాస్త ఇబ్బందే.. దురద ఎక్కువగా ఉంటుంది..దురద తట్టుకోలేక దాన్ని క్లీన్‌ షేవ్‌ చేయిస్తుంటారు. గడ్డం దురద అనేది..ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రావచ్చు. కాబట్టి మందపాటి గడ్డం ఉన్నవారు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. గడ్డం దురదను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా, మందపాటి గడ్డాలు ఉన్నవారు పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. దీని కోసం మీ చర్మ రకాన్ని బట్టి మంచి క్లెన్సర్‌ని ఉపయోగించండి.
అలాగే ప్రతిరోజూ తలస్నానం చేసే ముందు గడ్డానికి నూనెతో మసాజ్ చేయండి.
గోరువెచ్చని నీటితో గడ్డం కడగడం వల్ల కూడా గడ్డం దురద వచ్చే అవకాశం తగ్గుతుంది. తద్వారా గడ్డంలోని ఫంగస్, బ్యాక్టీరియా తొలగిపోతాయి.
గడ్డం వెంట్రుకలు బాగా పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం ప్రతిరోజూ హైడ్రేటింగ్ కండీషనర్ ఉపయోగించండి.
షేవింగ్ లేదా ట్రిమ్ చేసిన తర్వాత ఆఫ్టర్ షేవ్ వాష్ లేదా లోషన్‌ను ఉపయోగించాలి.
మీరు మీ గడ్డానికి సబ్బును ఉపయోగిస్తే, మీ గడ్డాన్ని నీటితో బాగా కడగాలి. ఎందుకంటే కొన్నిసార్లు సబ్బు కూడా చికాకు కలిగిస్తుంది.
మీరు మొదటిసారి గడ్డం పెంచుతున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
మీరు మొదటిసారి గడ్డం పెంచాలని ఆలోచిస్తున్నట్లయితే, వెంటనే షేవింగ్ మరియు ట్రిమ్ చేయడం ప్రారంభించవద్దు. దీని వల్ల చర్మం కూడా దెబ్బతింటుంది. ఓపిక పట్టండి. ముందుగా గడ్డం సరిగ్గా పెంచండి. ఆ తరువాత, దానిని నిర్వహించడం ప్రారంభించండి.

Read more RELATED
Recommended to you

Latest news