తెలంగాణకు బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ సంస్థ.. రూ.700 కోట్ల పెట్టుబడులు

-

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరోసంస్థ ముందుకొచ్చింది. అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే ‘బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌’ సంస్థ రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. బీర్లు, శీతలపానీయాలు, పర్‌ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ సంస్థ ఇండియా కార్పొరేట్‌ వ్యవహారాల అధిపతి గణేశన్, ఇతర ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును కలిసి తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు.

‘బాల్‌’ సంస్థకు రాష్ట్రంలో అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంస్థతో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్‌ చేయడానికి ఎక్సైజ్‌ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని వెల్లడించారు. 500 మి.లీ. పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్‌ చేయడం వల్ల కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్‌బాబు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news