కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ : బల్మూరి వెంకట్

-

జగిత్యాల జిల్లా కేంద్రం లో ని పద్మనాయక వెలమ ఫంక్షన్ హల్ లో వెలమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కొన్ని కామెంట్స్ చేసారు. వెలమ సంఘం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే పీసీసీ అధ్యక్షులు సదరు ఎమ్మెల్యే శంకరయ్య కు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అయితే పీసీసీ అధ్యక్షుని నోటీసులకు స్పందించిన సదరు ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు అని పేర్కొన్నారు.

ఇక ఏ కులం వారైనా ఇతర కులాల ను కించపరచడం తప్పు. కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాలలో చేసిన దోపిడీ గురించి మాట్లాడారని తెలిపారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ.. సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని ప్రోత్సహించదు అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news