79 రూపాల జీతం పెంచి 1000 పెంచినట్లు చెప్తున్నారు : శ్రీనివాస్ గౌడ్

-

హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎదో ఉద్దరిస్తారు,వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారు అనుకున్న. కానీ నిన్న 79 రూపాల జీతం పెంచి 1000 రూపాల జీతం పెంచామని గొప్పలు చెప్తున్నారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోలీస్ లతో సమానంగా డ్రెస్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేక లివ్ లు కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఈ హోమ్ గార్డులు పర్మనెంట్ చేస్తారు అన్నారు. ఏమైంది మరి. చనిపోయిన వారికి కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇస్తారు అనుకున్నాం.

మేము డిమాండ్ చేస్తున్న స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ లు అని వారిని పర్మనెంట్ చేయండి. చనిపోయిన హోమ్ గార్డులకు 10 లక్షల ఏక్షగ్రేషియా ఇవ్వండి. రిటైర్ అయిన హోమ్ గార్డులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి. పోలీసులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హోమ్ గార్డులకు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. హోమ్ గార్డుల నియామకాలు వెంటనే చేపట్టాలి. ఉద్యోగులకు డిమాండ్లు పరిస్కారం చేయాలి.హోమ్ గార్డులకు వారి అసోసియేషన్ ఉండాలి అని డీజీపీ కార్యాలయంలో రూమ్ ఉండాలని చెప్పడం జరిగింది.ఇప్పుడు రూమ్ తాళాలు ఇవ్వడం లేదు హోమ్ గార్డులను వేధిస్తే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా వారికి అండగా ఉంటాం. 79 రూపాయలు ఇచ్చి 1000 రులయాల పెంచామని అంటే ఊరుకునేది లేదు అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news