తెలంగాణ‌లో చైనా మాంజ‌పై నిషేధం

-

సంక్రాంతి పండగ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గాలి ప‌టాలు ఎగ‌ర‌వేయ‌డం ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న సంప్ర‌దాయం. అయితే ప్ర‌స్తుతం కాలంలో గాలి ప‌టాలు ఎగ‌ర‌వేయ‌డానికి చైనా మాంజ‌ను వాడుతున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం చైనా మాంజ వాడ‌కాన్ని త‌గ్గించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తుంది. ఈ ఏడాది కూడా చైనా మాంజ వాడాకాన్ని త‌గ్గించ‌డానికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలో చైనా మాంజ వాడాకాన్ని పూర్తి స్థాయిలో త‌గ్గించాల‌ని చైనా మాంజ పై నిషేధం విధించింది. చైనా మాంజ‌ను విక్ర‌యించినా.. లేదా వినియోగించిన క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలంగాణ పోలీసులు హెచ్చ‌రించారు. గురువారం రాత్రి స‌మ‌యంలోనే హైద‌రాబాద్ న‌గ‌రంల‌ని ప‌లు ప్రాంతాల‌లోని దుకాణాల‌పై పోలీసులు రైడ్ చేశారు. నిల్వ ఉన్న చైనా మాంజ‌ను గుర్తించి సీజ్ చేశారు. కాగ చైనా మాంజతో అనేక ప్ర‌మాదాలు జ‌రుగుతాయి. ముఖ్యంగా ఈ చైనా మాంజ‌తో ప‌క్ష‌లు తీవ్ర ఇబ్బందులు గురి అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news