జగిత్యాల జిల్లాలో మరో కొత్త మండలం

-

రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలో నూతన మండలం ఏర్పడింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం నుంచి 10 గ్రామాలను వేరు చేసి బండలింగాపూర్‌ కేంద్రంగా కొత్త మండలాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ శాఖ సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గెజిట్‌ విడుదల చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మెట్‌పల్లి మండలం నుంచి రాజేశ్వరావుపేట, మేడిపల్లి(డబ్ల్యూ), రామచంద్రంపేట, విట్టంపేట, మెట్ల చిట్టాపూర్‌, జగ్గాసాగర్‌, రామ లచ్చక్కపేట, రంగారావు పేట, బండలింగాపూర్‌, ఆత్మకూరు గ్రామాలను వేరు చేసి కొత్త మండలం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై  ప్రజలకు అభ్యంతరాలు, సూచనలుంటే 15 రోజుల్లోగా  కలెక్టర్‌కు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కొత్త మండలం ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 613కు చేరుకోనుంది.

మరోవైపు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ కంగ్టి మండలంలో ఉన్న బాబుల్‌గామ్‌ రెవెన్యూ గ్రామాన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ పెద్దకొడప్‌గల్‌ మండలానికి బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version