బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

-

హన్మకొండ: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి న్యాయస్థానంలో ఉరట లభించింది. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు హనుమకొండ కోర్టును ఆశ్రయించారు.

 

ఆయన బెయిల్ ని రద్దు చేయాలని కోర్టుని కోరారు పోలీసులు. ఈ క్రమంలో వాదనలు విన్న కోర్టు తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు పోలీసులు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ని కొట్టివేస్తున్నట్లు కోర్ట్ తీర్పును వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news