బండి సంజయ్.. సిపి నీ చెంప పగలకొట్టినా నీకు పౌరుషం లేదు: జగ్గారెడ్డి

రాష్ట్ర బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్ర బీజేపీ పరిస్థితి వీఐపీ ఇంట్లో కుక్క లాగా మారిపోయింది అన్నారు. ఎవరైనా రాగానే అరవడం ఓనర్ బయటకు రాగానే సైలెంట్ అయిపోవడం రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఈ విధంగా తయారయింది అని మండిపడ్డారు జగ్గారెడ్డి. టిఆర్ఎస్, బిజెపి, ఎమ్ఐఎమ్ మధ్య రాజకీయ అక్రమ సంబంధం కొనసాగుతోంది అని ఆరోపించారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

బండి సంజయ్ ది కేవలం మధ్యవర్తిత్వమేనని.. సిపి నీ చెంప పగలగొట్టినా నీకు పౌరుషం లేదు.. నువ్వు జనాన్ని ఎం కాపాడతావని అన్నారు. ప్రధాని అనుమతితోనే కెసిఆర్ హర్యానా వెళ్లాడని ఆరోపించారు జగ్గారెడ్డి. మోడీ, కేసీఆర్ వి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అన్నారు. కెసిఆర్ ఢిల్లీ కి.. మోడీ హైదరాబాద్ కి ఇదేం రాజకీయమని అనుమానం వస్తుంది అన్నారు. ఎన్టీఆర్ కూడా ఇందిరా గాంధీ కి స్వాగతం పలికారని.. కానీ కెసిఆర్ ఏ ధైర్యంతో మోడీ వచ్చే టైం లో ఢిల్లీకి పోయారు అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.