కరీంనగర్‌లో పోటీకి కాంగ్రెస్‌కు అభ్యర్థులు కూడా లేరు: బండి సంజయ్‌

-

తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో రెండంకెల సీట్లే లక్ష్యంగా కాషాయదళం ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మరోసారి గెలుపు తీరాలకు చేరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

తాజాగా సిరిసిల్లలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్లో పోటీకి కాంగ్రెస్కు కనీసం అభ్యర్థి కూడా లేరని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా.. కరీంనగర్‌కు ఐదేళ్లలో రూ.12 వేల కోట్ల నిధులు తెచ్చానని తెలిపారు.

‘కరీంనగర్‌లో పోటీకి కాంగ్రెస్‌కు అభ్యర్థులు కూడా లేరు. కరోనా వేళ కరీంనగర్‌ ప్రజలకు అనేక సేవలు అందించాం. కరోనాతో 8 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. కరోనా వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు అసలు బయటకే రాలేదు. రైతులకు పరిహారం ఇవ్వాలని పోరాడింది మేమే. రైతు రుణమాఫీ అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది.’ అని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news