కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌వి నాటకాలు: బండి సంజయ్‌

-

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎండీ బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వేములవాడ ప్రజాహిత యాత్రలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ బంధువులు ఎల్ అండ్‌ టీని బెదిరించి సబ్‌ కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. వారు చేసిన నాసిరకం పనుల వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతకు ముందు సంజయ్‌ను కలిసిన ఆటోడ్రైవర్లు మహిళలకు ఉచిత ప్రయాణంతో తమ బతుకుదెరువు ప్రశ్నార్థకమైందని మొర పెట్టుకోగా వారికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...