కిషన్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం – బండి సంజయ్

-

కిషన్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బండి సంజయ్ వెల్లడించారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో బండి సంజయ్ మాట్లాడుతూ… మోదీ ది బాస్…. ప్రపంచమే పాదాభివందనం చేస్తున్న మహానుభావుడు ఈ ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వాగతం అన్నారు. 6 వేల 100 కోట్ల నిధులుతో అభివ్రుద్ది పనులకు ముఖ్యంగా కరీంనగర్ –వరంగల్ జాతీయ రహదారుల పనులు ప్రారంభించేందుకు వచ్చిన మోదీకి ధన్యవాదాలు చెప్పారు.

కేసీఆర్…..మోదీ నీ దోస్త్ అన్నవ్ కదా? నువ్వెందుకు రాలేదు? రావడానికి నీకు ముఖం లేదని ఆగ్రహించారు. నరేంద్రమోదీకి ప్రజలంతా లేచి చప్పట్లు కొట్టాలి…. మీరు జై మోదీ అనే నినాదాలతో కేసీఆర్ చెవుల నుండి రక్తం కారాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ కార్యకర్తగా ఉన్న నన్ను అర్బన్ డైరెక్టర్ గా, కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చిన బీజేపీకి రుణపడి ఉంటా…శిరస్సు వంచి దండాలు పెడుతున్నానని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ జెండాను మోసిన భుజం అన్నా… 140 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇచ్చే మహానుడు భావుడు భుజం తడితే ఎట్లా ఉంటదో ఈ భుజాన్ని అడగితే చెబుతుందని వివరించారు. ఒక్కసారి మోదీ నోటి నుండి సంజయ్ అని ఎప్పుడంటారా? అని ఎదురు చూసిన… కానీ నన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు దండాలు.. మా జాతీయ నాయకత్వం నన్ను అధ్యక్షుడిని చేసిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version