కరీంనగర్ పార్లమెంట్ పై బీజేపీ పార్టీ మాజీ చీఫ్ బండి సంజయ్ గురి పెట్టినట్లు సమాచారం అందుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిన బండి…కరీంనగర్ పార్లమెంట్ పై గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు బండి సంజయ్.
రోజుకో అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్త్రత సమీక్ష చేయనున్నారు. వచ్చే నెల తొలి వారం నుండి రోజుకు 3 మండలాల వారీగా సమీక్ష చేయనున్నారు. ఎన్నికల పలితాల సరళిపై కార్యకర్తలతో చర్చించనున్నారు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేయడమే లక్ష్యంగా బండి సమీక్షలు చేయనున్నారు. సంక్రాంతి తరువాత నేరుగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమైన సంజయ్..బీజేపీ గెలుపు కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
అనంతరం బీజెపీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం బండి సంజయ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా రాబోయే 45 రోజులపాటు తన పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించిన బండి సంజయ్ సంక్రాంతి తరువాత నేరుగా జనం వద్దకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.