బండి క‌ట్టు త‌ప్పుతోందా?

-

తెలంగాణలో గులాబీ ద‌ళానికి ఎదురులేకుండా పోయింది అన‌డం కంటే ఎదురు నిలిచే పార్టీ లేకుండా పోయింది అన‌డం క‌రెక్టేమో. ఎంత ఉద్య‌మ పార్టీ అయినా త‌ప్పులు చేయ‌కుండా వుండ‌దు. త‌ప్పులు చేసింది కూడా. తొలి సారి అధికారాన్ని చేప‌ట్టినా ఉద్య‌మ పార్టీగానే వ్య‌వ‌హ‌రించింది అధికార తెరాసా.. ఇక రెండ‌వ ద‌ఫా ముగ్గుతూ ముల్గుతూ గ‌ట్టెక్కింది.

ఇక ఇక్క‌డి నుంచే ఫ‌క్తూ రాజ‌కీయ పార్టీగా రాజ‌కీయాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఒంటెద్దు పోక‌డ‌లకు శ్రీ‌కారం చుట్టారు కేసీఆర్‌. క‌రోనా రాష్ట్రాన్ని క‌బ‌లిస్తున్నా త‌న ప‌ట్టుని సాధించాలిని స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌కే పెద్ద పీట వేసిందే కానీ జ‌నారోగ్యాన్ని మాత్రం గాలికి వ‌ద‌ల‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా , కోర్టులు మొట్టికాయ‌లు వేసినా లైట్ తీసుకున్న తెరాస అధినేత కేసీఆర్ త‌న ప‌ట్టు కోస‌మే ప్ర‌య‌త్నించారే కానీ క‌రోనా క్రైసిస్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న‌ది నిర్వివాదాంశం.

ఇదే అంశం అధికార తెరాస‌కు రానున్న జీహెచ్ ఎంసీ ఎన్న‌క‌ల్లో ప‌చ్చి వెల‌క్కాయ‌గా మార‌బోతోంది. త‌న‌లేరు. క‌క్క‌లేరు అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ని మాత్రం ఈ ఎన్నిక‌ల్లో ఫేస్ చేయ‌డం గ్యారెంటీ అన్న‌ది తెలంగాణ ప‌ల్లెల‌తో పాటు హైద‌రాబాద్ ప్ర‌జ‌లు  ఎరిగిన న‌గ్న స‌త్యం. ఇదే అంశం ప్ర‌తి ప‌క్షాల‌కు ప‌నికొస్తుందా అంటే దాన్ని వినియోగించుకునే ప్ర‌తి ప‌క్షం తెలంగాణ లో వుందంటే అది భ్ర‌మే. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎంత గొంతు చించుకున్నా అత‌న్ని న‌మ్మే వారు లేరు. అత‌ని వెంట కాంగ్రెస్ సీనియ‌ర్ క్యాడ‌రే న‌డ‌వ‌లేని ప‌రిస్థితి. ఇక బీజేపీదీ అంతే.

లైమ్ లైట్‌లో కీల‌క నేత‌లుండ‌గా బండి సంజ‌య్‌కి తెలంగాణ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఆయ‌నకూ తాజా వివాదాన్ని అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. పైగా పార్టీకి ఈ ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు కూడా దూర‌మ‌య్యే త‌ర‌హాలో ఆయ‌న వ్యాఖ్య‌లు వుంటున్నాయి. తాజాగా అల్వాల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బండి పాత‌బ‌స్తీలో త‌మ వారిపై చేయి ప‌డితే న‌రికేస్తాం అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి పార్టీకి మ‌రింత న‌ష్టాన్ని క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో బండి క‌ట్టు త‌ప్పుతోంద‌ని ప‌లువురు రాజ‌కీయ విమ‌ర్శ‌కులు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. తెలంగాణ లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, క‌రోనా వేళ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుపై గ‌ట్టిగా నిల‌దీసే ప్ర‌తిప‌క్ష్యం లేక‌పోవ‌డం నిజంగా తెలంగాణ ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌మే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version