పార్టీ మారిన చోట ఉపఎన్నికలు నిర్వహించాలి : బండి సంజయ్

-

కాంగ్రెస్‌ పాంచ్‌ న్యాయ్‌ పత్ర్‌ హామీ మేరకు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారితే వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 26 మంది టచ్‌లో ఉన్నారంటున్న కాంగ్రెస్‌ పార్టీకి, వారితో రాజీనామా చేయించి గెలిపించుకునేందుకు భయం పట్టుకుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన బండి సంజయ్‌ కాంగ్రెస్పై మండిపడ్డారు.

నాయకులపై ఈడీ, సీబీఐ కేసులు ఉంటే బీజేపీలోకి తీసుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. యుతవకు ఉద్యోగాల్లేక తల్లడిల్లుతుంటే కాంగ్రెస్‌ నేతలకు ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. కొలువులివ్వకుంటే వారి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. కేంద్రమంత్రి పదవితో పగ్గాలు పడినా.. రాజకీయ విమర్శల్లో తన దూకుడు తగ్గబోదని స్పష్టం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలివ్వలేక…ఆ అంశం పక్కదారి పట్టించేలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆక్షేపించారు. ఎంఐఎం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తుందన్న సంజయ్‌.. తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఎవరు అధికారంలో ఉంటే వారి పంచనచేరుతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news