సీఎం కేసీఆర్ పై హత్య కేసు ?

-

ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

ఈరోజు వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారి హత్య, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులపై స్పందించారు. సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నడు. సీఎం కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారు. బీజేపీ నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నడు. తన పదవిని కాపాడుకునే యత్నం చేస్తున్నాడని బండి సంజయ్‌ ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version