బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి గల కారణం ఏంటో చెప్పుకొచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. నేడు మహబూబ్నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ ఐక్యవేదిక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు విహెచ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ – బిజెపి రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. కెసిఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే బండి సంజయ్ ని బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో రాహుల్ గాంధీ హవా నడుస్తుందని.. ప్రజలలో రాహుల్ గాంధీకి క్రేజ్ పెరిగిందన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు వీ హనుమంతరావు.