బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌..బీజేపీలోకి ఆరూరి రమేష్‌?

-

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో నాయకుడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు లాంటి కీలక లీడర్లు పార్టీ మారగా… మరికొంతమంది కిందిస్థాయి లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

Aroori Ramesh may joins in BJP

అయితే తాజాగా గులాబీ పార్టీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. త్వరలోనే వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌… బీజేపీ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి షాక్ ఇవ్వనున్న…. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌… బీజేపీ పెద్దలను కలిశారు. వరంగల్ ఎంపీ టికెట్‌ ఇస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ కు బీజేపీ ఆఫర్‌ కూడా ఇచ్చిందట. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌… త్వరలో బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news