జూన్1 నుంచి బాసర ఆర్‌జీయూకేటీ ప్రవేశాలు

-

బాసరలోని ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చుని ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.వెంకటరమణ తెలిపారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1,500 సీట్లు అందుబాటులో ఉంటాయని .. అందులో 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చని చెప్పారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తామన్నారు.

తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా..రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న వారు ఆ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని వెంకటరమణ వెల్లడించారు. దానికితోడు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.వెయ్యి, కాషన్‌ డిపాజిట్‌ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700… మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

దరఖాస్తుల సమర్పణ: జూన్‌ 1 నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు

సీట్ల కేటాయింపు: జులై 3న

ధ్రువపత్రాల పరిశీలన: జులై 8 నుంచి 10 వరకు

Read more RELATED
Recommended to you

Latest news