మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

-

తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ సర్కార్ బతుకమ్మ కానుకగా ప్రతి ఏటా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 80 శాతం చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. పండుగ సమీపిస్తున్న వేళ ఆడపడుచులకు చీరలు అందజేసేందుకు రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరలు 250 డిజైన్లలో రూపొందించారు. చేనేత సంఘాల ఆధ్వర్యంలో రూ.354 కోట్లతో 1.02 కోట్ల చీరలను సిద్ధం చేశారు.

టెక్స్‌టైల్ శాఖ గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను తయారు చేసింది. జరీతో పాటు వివిధ రంగుల కాంబినేషన్లతో 250 డిజైన్లలో చీరలు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు మీటర్ల (5.50+1.00) పొడవైన సాధారణ చీరలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్ల పొడవైన చీరలను కూడా తయారు చేసినట్లు వెల్లడించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల నేత కార్మికులతో వీటిని తయారు చేయిస్తున్నారు. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన బాలికలకు ఈనెల 4వ తేదీ నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ చేనేత జౌళిశాఖ సన్నాహాలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version