NDA లో చేరుతామని కేసీఆర్ అడిగారు..ఇది వాస్తవమే అంటూ బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా NDA ల చేరుతామని కేసీఆర్ గారు అడిగి ఉండవచ్చు..నిజమై తప్పక ఉండి ఉంటదంటూ ఈ సందర్భంగా ఆసక్తి కర మైన వ్యాఖ్యలు చేశారు.
2009లో కూడా తెలంగాణాల మహాకూటమి పేర కమ్యూనిష్టులతో కలిసి పోటీ చేసిన సీఎం కేసీఆర్ గారు కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానా NDA ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకమున్నదని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ గారు ఈ విషయంలో మోడీగారిని తిట్టటం అవసరం కాదు…అసమంజసం కూడా అని ఫైర్ అయ్యారు విజయ శాంతి. పాలమూరు ఇందూర్ లో బహిరంగ సభ విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. రెండు ప్రారంభోత్సవం సందర్బంగా 20 వేల కోట్లు అభివృద్ధి పనులకు ధన్యవాదాలు తెలిపారు.