Telangana : రాష్ట్రంలో బీర్ల అమ్మకాల జోరు.. లిక్కర్ విక్రయాలు బేజారు

-

తెలంగాణలో మందుబాబులో రెచ్చిపోతున్నారు. వేసవి ఎండ తాపానికి తాళలేక తెగ బీర్లు తాగేస్తున్నారు. వేసవితాపం వల్ల లిక్కర్ కు కొన్నిరోజులు మద్యం ప్రియులు గుడ్ బై చెప్పినట్లు కనిపిస్తోంది. తాజా విక్రయాలు చూస్తే ఇదంతా నిజమేననిపిస్తోంది. ఎందుకంటే..

రాష్ట్రంలో బీర్ల విక్రయాలు జోరందుకున్నాయి. అదే సమయంలో లిక్కర్‌ అమ్మకాలు తగ్గుతున్నాయి. వేసవి సీజన్‌ దృష్ట్యా వాటి అమ్మకాలు ఎక్కువ కావడం సాధారణమే అయినా గతంతో పోల్చితే భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఏప్రిల్‌ నెలలో ఇప్పటివరకు సుమారు 26 లక్షల కేస్‌లు అమ్ముడయ్యాయి. ఒక్కో కేస్‌కు 12 బాటిళ్లు ఉంటాయి. అదే లిక్కర్‌ అయితే 6 ఫుల్‌ బాటిళ్లు ఉంటాయి.

ఆబ్కారీశాఖ గణాంకాల ప్రకారం ఈనెలలో 19 రోజుల్లో దాదాపు 3.22 కోట్ల బీర్లను తాగేశారు. వేసవితాపం పెరిగిందనే కారణంతో లిక్కర్‌ తాగేవారిలో కొందరు బీర్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. మరికొందరు రెండూ తాగుతున్నట్టు చెబుతున్నారు. గత జనవరి నుంచి చూస్తే బీర్ల విక్రయాల్లో పెరుగుదల.. లిక్కర్‌ అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరిలో దాదాపు 34లక్షల కేస్‌లుగా ఉన్న బీర్ల విక్రయాలు మార్చి నాటికి సుమారు 47లక్షల కేస్‌లకు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version