భద్రాద్రి రాముడికి వైభవంగా మహాపట్టాభిషేకం

-

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంలో రామయ్యకు మహా పట్టాభిషేకం మహోత్సవం జరిగింది. భక్తజనం శ్రీరామ నామాలు పఠిస్తూ ఉత్సవాన్ని కనులారా వీక్షించారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న స్వామి వారి కల్యాణ మూర్తులను ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకొచ్చి శ్రీరామ షడక్షరి మంత్రాలను పఠించారు. శ్రీ రామాయణ మహా క్రతువులో భాగంగా సామూహిక పారాయణం చేశారు.

స్వర్ణ సార్వభౌమ వాహనంపై దేవ దేవుడు మిథిలా మండపానికి రావడంతో ఆ ప్రాంతమంతా శ్రీ రామనామ స్మరణతో మారుమోగింది. మహా పట్టాభిషేక విశిష్టతను వైదిక పెద్దలు వివరించారు. రాములవారి పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరామ చంద్రుడి పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ముందుగా ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు గవర్నర్‌కు స్వాగతం పలికి శ్రీరాముడి దర్శనం కల్పించారు. అనతంరం తీర్థ ప్రసాదాలు సహా వేద ఆశీర్వదం అందించారు. భారతీయల గుండెల్లో రాముడు ఎప్పుడూ ఉంటాడని ఈ సందర్భంగా గవర్నర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news