ఈడీ కేసులో శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్‌

-

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి దంపతులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) చర్యలకు ఉపక్రమించింది. నటి శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా దంపతులపై చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసుకుంది. జుహూలో శిల్పా శెట్టి పేరిట ఉన్న ఫ్లాట్‌ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌ కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్‌ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. మొబైల్ అప్లికేషన్‌లలో అశ్లీల చిత్రాలను సృష్టించి, అప్‌లోడ్ చేశారనే ఆరోపణలతో ముంబయి పోలీసులు గతేడాది రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇక శిల్పా శెట్టి తెలుగు వాళ్లకు సుపరిచుతురాలే. ఈ భామ టాలీవుడ్లోనూ చాలా సినిమాలు చేసింది. మోహన్ బాబుతో వీడెవ్వడండి బాబు, వెంకటేశ్తో సాహసవీరుడు సాగరకన్యలో నటించింది. ఈ చిత్రంలో సాగరకన్యలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో సూపర్ బిజీ నటిగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news