అక్టోబర్ 1న హైదరాబాద్​లో ‘భారత్ దాల్’ కార్యక్రమం.. రూ.60లకే కిలో శనగపప్పు విక్రయం

-

శనగ పప్పు ఇక నుంచి కిలో రూ.60లకే లభించనుంది. రేపటి నుంచి ఈ ధర అమల్లోకి రానుంది. శనగ నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో.. ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీపై పప్పును విక్రయించేందుకు కేంద్ర సర్కార్ నిర్ణయించింది. శనగ నిల్వలు భారీగా ఉండడంతో మొదటిదశలో వాటిలో 20 శాతం సబ్సిడీపై విక్రయించాలని నిర్ణయించిన కేంద్రం.. 18 రాష్ట్రాల్లో విక్రయాలు చేపట్టనుంది. తెలంగాణలో 200 ఆటోల ద్వారా ఈ పప్పును విక్రయించే బాధ్యతను హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం(హాకా)కు అప్పగించింది.

‘భారత్‌ దాల్‌’ పేరిట అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా 50 వేల టన్నుల శనగపప్పును రాష్ట్రంలో విక్రయించనుంది. ఈ పథకం కింద శనగపప్పు కిలో విడిగా రూ.60కి విక్రయిస్తారు. 30 కిలోల బస్తా తీసుకుంటే కిలో రూ.55 ధరకే లభిస్తుంది. వినియోగదారులతో పాటు దేవాలయాలు, ధార్మిక సంస్థలు, జైళ్లు, పోలీసు శాఖలు, ప్రభుత్వేతర సంస్థలు, చిల్లర, టోకు వ్యాపారులు, షాపింగ్‌ మాల్స్‌, ఇ-కామర్స్‌ సంస్థలు, ఆసుపత్రులు, సామూహిక వంటశాలలు, ప్రాథమిక సహకార సంఘాలకు సైతం 30 కేజీల సంచులను విక్రయించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news