అక్టోబర్ 5వ తేదీన రావిర్యాలలో మెగా డెయిరీ ప్రారంభం

-

రాష్ట్రంలో పాడి రైతులను ప్రోత్సహించేందుకు.. పాడి సంపదను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో మెగా డెయిరీని నిర్మిస్తోంది. రూ.250 కోట్లతో నిర్మించిన ఈ డెయిరీ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. రావిర్యాల మెగా డెయిరీని అక్టోబరు 5న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

పాడి రైతులను ప్రోత్సహించే విధంగా లీటరుకు రూ.4 నగదు ప్రోత్సాహకం, సబ్సిడీపై పాడి గేదెలను అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో విజయ డెయిరీ రూ.800 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని చెప్పారు. ప్రైవేట్‌ డెయిరీలకు దీటుగా దానిని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు 42 ఎకరాల విస్తీర్ణంలో, అత్యాధునిక నాణ్యత ప్రమాణాలతో ఈ మెగా డెయిరీ అందుబాటులోకి వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ప్లాంట్​లో రోజుకు 5-8 లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతాయని వెల్లడించారు. దీనికి అనుగుణంగా మార్కెటింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news