మన్మోహన్ కి భారతరత్న.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం

-

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు అన్నీ పార్టీలు ఆమోదం తెలిపాయి. ఇక తీర్మాణాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లనుంది. మరోవైపు అసెంబ్లీలో సభ్యులు మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులు అర్పించారు. 

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల కన్నుమూసిన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలియజేసేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news