భట్టి పాదయాత్ర చారిత్రాత్మకమైనది – మాణిక్ రావ్ ఠాక్రే

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పాదయాత్ర ఓ చారిత్రాత్మకమైనదని అన్నారు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దయానియా పరిస్థితి మారలేదన్నారు. భట్టి పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. ఈ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళ్తుందన్నారు మాణిక్ రావ్ ఠాక్రే.

ఇక భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీపుల్స్ మర్చ్ పాదయాత్ర.. ఇన్చార్జి ఠాక్రే ఆదేశాల మేరకు జరిగిందన్నారు. నడిచింది తానే అయినా నడిపించింది ఏఐసీసీ అని తెలిపారు. పాదయాత్ర రూట్ కూడా ఠాక్రేనే డిసైడ్ చేశారని తెలిపారు భట్టి. ఈ పాదయాత్రను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమన్వయం చేశారన్నారు. అలాగే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల బాధలను చూశారని తెలిపారు. భట్టి పాదయాత్ర మాలో స్ఫూర్తిని నింపిందన్నారు.