భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2014లో భూమా శోభా నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియ ఆళ్లగడ్డకు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత తండ్రి నాగిరెడ్డి తో కలిసి టిడిపిలో చేరారు. టిడిపి అఖిలప్రియకు మంత్రి పదవిని ఇచ్చి సముచిత స్థానం ఇచ్చింది.
కానీ అఖిల ప్రియ తన సొంత నిర్ణయాలతో, తన శైలి రాజకీయాలతో పార్టీ క్యాడర్ ను, సొంత బంధువులను కూడా దూరం చేసుకున్నారు. 2019లో టిడిపి తరఫున పోటీ చేసి ఘోర పరాజయం పొందారు. 2019 ఓటమి తర్వాత అఖిలప్రియ హైదరాబాద్ కు మకాం మార్చారు. అప్పుడప్పుడూ ఆళ్లగడ్డకు వచ్చినా నాయకులతో దూరం దూరంగా ఉంటూనే వచ్చారు. పార్టీ క్యాడర్ తో సాన్నిహిత్యాన్ని కోల్పోయారు అని సన్నిహితులు అంటున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ ఆళ్లగడ్డలో తన పోటీ చేయాలని రాజకీయంగా పావులు కదుపుతోంది. ఆళ్లగడ్డలో మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని అడిగినట్లు సమాచారం. కానీ అఖిలప్రియకు ఆళ్లగడ్డ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సుముఖంగా లేరని సన్నిహితులు అంటున్నారు .
అఖిలప్రియ పై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత, క్యాడర్ లో పట్టు లేకపోవడం, అఖిలప్రియ వ్యవహార శైలి నచ్చకపోవడం వలన ఆళ్లగడ్డలో మళ్లీ అఖిల ప్రియకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు, సర్వేలు చెబుతున్నాయి. దాదాపు సీటు దక్కకపోవచ్చు..దక్కినా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఓటమి తప్పేలా లేదు.