విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం : భట్టి విక్రమార్క

-

రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత BRS ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40% మెస్ చార్జీలు పెంచాం.. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఐదువేల కోట్లు కేటాయించాం. పాఠశాలలు ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫార్మ్స్ సరఫరా చేసాం.

ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూజీ.. ఆయన నిర్ణయాలతోనే నేడు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేని దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి.. రాకెట్లు తయారు చేసే స్థాయికి ఈ దేశాన్ని నెహ్రూ తీసుకువెళ్లారు. ప్రజలు జీవించడమే కాదు గౌరవప్రదమైన హక్కులు వారికి ఉండాలని మన తొలి ప్రధాని నెహ్రూ ఆలోచనలు చేశారు. శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పనకు ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలను స్థాపించుకున్నాం. ఆధునిక దేవాలయాలు పిలుచుకునే బహులార్ధక సార్థక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలే. కృష్ణానదిపై నాగార్జునసాగర్, గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రం మీదుగా రెండు జీవ నదులు పారించేందుకు చాచా నెహ్రూ పునాదులు వేశారు అని భట్టి విక్రమార్క తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news