సుంకిశాల వాల్ కూలడం BRS పుణ్యమే..!

-

వర్షాల నేపథ్యంలో చెట్లు, స్థంబాలు, విద్యుత్ వైర్స్ ఒరిగే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ నగరం దేశానికి తలమానికం. హైదరాబాద్ కు చాలా మల్టిలేవల్ కంపెనీలు వస్తున్నవి. వాటికి కూడా విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని సూచించినట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సుంకిశాల గోడ కూలిందని చూశా. హైదరాబాద్ కి నీటి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.

గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల్లోనే క్వాలిటీ లేదు అనుకున్నాం. కానీ గోదావరి కాకుండా కృష్ణనదిలో నిర్మాణం అయ్యే వాటిని కూడా వదలలేదు అని అర్ధం అవుతుంది. 11.06.21న BRS హాయంలో అనుమతులు ఇచ్చారు. 2022లో సుంకిశాల నిర్మాణం ప్రారంభించారు. జులై 23లో వాల్ పూర్తి అయింది. ఇప్పుడు సాగర్ లో నీళ్లు వచ్చాయి కాబట్టి కూలింది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై నెట్టి వేయాలని BRS చూస్తుంది. కానీ ఆ BRS పుణ్యమే సుంకిశాల వాల్ కులడం. అయితే ఈ ఘటన పై విచారణకు ఆదేశిస్తాం అని భట్టి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news