నక్లెస్ రోడ్డులో జరిగిన తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక విషయాలు వెల్లడించారు. మూసి పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు కాదు నువ్వు, నీ కుటుంబం గుడిసె వేసుకొని జీవించి చూపించు అని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక ప్రజలను మభ్య పెట్టడానికి ఒక రోజు మూసి తీరంలో నిద్ర చేసి తర్వాత విలాసమైన ప్యాలెస్ లో ఉండటం సరికాదు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు బాగుపడటం BRSకి ఇష్టం లేదు. 10 సంవత్సరాలు పాలించిన బి ఆర్ ఎస్ నగర అభివృద్ధికి పది పైసలు ఖర్చు చేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగింది. మూసిని జీవ నదిగా మార్చాలని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఢిల్లీ లాంటి ముప్పు రావొద్దని కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది. దేశం గర్వించే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ ను మార్చాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించాం అని భట్టి విక్రమార్క తెలిపారు.