ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా – భట్టి విక్రమార్క సతీమణి నందిని

-

ఖమ్మం ఎంపీగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీచేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లు భట్టి విక్రమార్కకు సీఎం పదవి రాకపోవడంపై ఫైర్‌అయ్యారు నందిని. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది…భట్టి విక్రమార్కను సీఎం చేయకపోవడం బాధ కలిగించిందని మండిపడ్డారు. వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క ను ముఖ్యమంత్రి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

Bhatti Vikramarkas wife Nandini

కానీ మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందన్నారు. ప్రజలు నన్ను ఖమ్మం ఎంపీ కావాలని కోరుకుంటున్నారు.. పోటీ చేస్తానని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని. మేము పదేళ్లు కాపాడిన మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల లాంటి ప్యారాచుట్ లీడర్లని గెలిపించిందన్నారు. వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించాం.. మంత్రి పదవి ఇచ్చాం. వారు అంతకు మించి ఆశించ వద్దని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని.

Read more RELATED
Recommended to you

Latest news