భూపాలపల్లి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారి 353 పై మోరంచవాగు ఉప్పొంగడంతో మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ కారణంగా భూపాలపల్లి పరకాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నుండి ములుగు వెళ్లే జాతీయ రహదారి కటాక్షాపూర్ వద్ద చెరువు పూర్తిగా నిండి మత్తడిపడుతుండంతో ఈరోజు వరద ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది.
హనుమకొండ జిల్లా కాజీపేట సోముడిలో గత రాత్రి పిడుగు పడి కొన్ని ఇండ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి అయ్యాయి. వర్షంతో నగరంలోని ముంపు ప్రాంతాలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. వరంగల్లోని ఎస్ఆర్ నగర్, డీకే నగర్, సంతోషిమాత కాలనీ, మధురానగర్, శాకరాశికుంట, శివనగర్, చింతల్, ఉర్సు, ఎన్టీఆర్ నగర్, మధురనగర్, పద్మానగర్, పోతన కాలనీ, బృందావన్ నగర్ తదితర ప్రాంతాలు నీటిమయం అయ్యాయి.