భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ అదిరిపోయే డ్యాన్స్ .. వీడియో వైరల్

-

భూపాలపల్లి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో స్థానిక ఇల్లందు గెస్ట్ హౌస్ లో పోలీసులు విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే హుషారుగా డీజే పాటలకు నృత్యం చేస్తూ సందడి చేశారు. ఎస్పీ డ్యాన్స్ చూసిన సిబ్బంది కూడా ఆయనతో కలిసి కాలు కదిపారు. ఇందులో డీఎస్పీ, సీఐ, ఎస్.ఐ లు ,ఇతర సిబ్బంది ఉన్నారు. వీరంతా ఎస్పీ కిరణ్ ఖరేను ఎత్తుకొని ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

ప్రస్తుతం ఎస్పీ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిత్యం విధుల్లో బిజీగా ఉండే అధికారులంతా ఇలా డ్యాన్స్ చేయడం చూసి చిల్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్పీ డ్యాన్స్పై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లను పోస్టు చేస్తున్నారు. కొందరు వావ్ బ్రో.. వాట్ ఏ డ్యాన్స్ అంటూ కామెంట్ చేస్తే.. మరికొందరేమో సినిమా హీరోను మించి డ్యాన్సులేస్తున్నారంటూ తెగ పొగిడేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news