తెలంగాణ, ఏపీ వాసులకు అలర్ట్. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో ఈరోజు నుంచి అనగా సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు, పశుకాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.