తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్..!

-

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఫలితాలను ప్రకటించిన TSLPRB….అర్హులు లేక 854 పోస్టులను బ్యాక్ లాగ్ లో ఉంచింది. ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో ఈ నెల 7-10 మధ్య అటెస్టేషన్ పత్రాలు అందుబాటులో ఉంటాయి. వాటిని డిజిటల్ గా ఫిల్ చేసి, డౌన్లోడ్ చేసి, ఫోటోలు అతికించి, 3 సెట్లపై గెజిటెడ్ అధికారితో సంతకాలు చేయించాలి. ఆయా పత్రాలను ఈ నెల 12, 13వ తేదీల్లో కార్యాలయాల్లో సమర్పించాలి.

కాగా, నిన్న పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు గాను… 12,866 మంది పురుషులు….. 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించనున్నారు.తెలంగాణ పోలీసుల నియామక మండలి చేపట్టిన కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను నియామక మండలి వెబ్‌సైట్లో వ్యక్తిగత లాగిన్లలో పొందుపరచనున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news