ఆ దేశంలో 94 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారు..? భారత్‌ ఎన్నో స్థానంలో ఉందంటే

-

పాతికేళ్లు వచ్చాక.. పెళ్లి అనేది పెద్ద సమస్య అయిపోయింది. లైఫ్‌ అప్పుడప్పుడే సెట్‌ అవుతుంది. ఇంతలో పెళ్లి అంటారు. అరే.. చదువు అయిపోయి రెండేళ్లు అవుతుంది. జాబ్‌ చేస్తున్నాం. జర ఎంజాయ్‌ చేద్దాం అనుకునే లోపే పెళ్లి పెళ్లి ఇంట్లో వాళ్లతో టార్చర్‌ అయిపోయింది కదా.! చాలా మంది పెళ్లి చేసుకుంటే అన్నీ సెట్‌ అవుతాయి అంటారు. అసలు అన్నీ సెట్‌ చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలి. లేదంటే.. పెళ్లి తర్వాత ఇమిడీయట్‌గా విడాకులే తీసుకుంటారు. దేశంలో ఎంత మంది విడాకులు తీసుకుంటున్నారో తెలుసా.? అసలు అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న దేశం ఏదో తెలుసా..?మన దేశం ఏ స్థానంలో ఉంది..?

విడాకులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారాయి. కొన్ని దేశాల్లో విడాకుల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సంబంధానికి అత్యంత విలువనిచ్చే భారతదేశంలో విడాకుల రేటు చాలా తక్కువగా ఉంది. పోర్చుగల్‌లో 94% వివాహిత జంటలు విడాకులు తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశంగా పోర్చుగల్ అపఖ్యాతి పాలైంది.

దేశ జనాభా, వివాహిత జంటలు, విడాకుల కేసుల ఆధారంగా ఏ దేశంలో విడాకుల రేటు ఎక్కువగా ఉందో గణాంకాలను గ్లోబల్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ విషయంలో పోర్చుగల్ అందరికంటే ముందుంది. పోర్చుగల్‌లో 94 శాతం విడాకుల రేటు ఉంది, ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్ ఉంది. స్పెయిన్‌లో 85% జంటలు విడాకులు తీసుకుంటారు.

లక్సెంబర్గ్, రష్యా, ఉక్రెయిన్, క్యూబా, ఫిన్లాండ్, బెల్జియం తర్వాతి స్థానాల్లో నిలిచాయి. యుఎస్‌లో విడాకుల రేటు 45 శాతం కాగా, చైనాలో ఇది 44 శాతం. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 41 శాతం జంటలు విడాకుల కోసం దాఖలు చేస్తున్నారు. ఈ దేశాల్లో విడాకుల రేటు ఎక్కువగా ఉంటే. భారతదేశంలో విడాకుల రేటు 1 శాతం. అవును భారతదేశంలో 1 శాతం మాత్రమే విడాకుల కేసులు ఉన్నాయి.

భారతదేశంలో సాంస్కృతిక, మత విశ్వాసాలు లోతుగా పాతుకుపోయాయి. కుటుంబ నిర్మాణం, కుటుంబ ఆచార వ్యవహారాలు సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల భారతదేశంలో విడాకుల రేటు తక్కువగా ఉంది. అయితే విడాకులు మాత్రమే తీసుకోవడం లేదు. విడిపోవాలి అనుకున్న వాళ్లు విడిపోయి బతుకుతున్నారు. విడాకులు తీసుకోవడం లేదు అంతే..అలా చూసుకున్నా ఇలా విడిపోయి ఉండే వారి సంఖ్య ఇండియాలో తక్కువే. ఆ విషయంలో మనం సంతోషపడాలి. కానీ ఈ సంఖ్య ఎప్పటికీ ఇలానే ఉంటుదన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు 1995లో పుట్టిన వారికి పెళ్లిళ్లు అవుతున్నాయి. ఈ జనరేషన్‌లో వారి ఆలోచనా విధానాలు వేరు. 1900కు ముందులా ఉండరు. నచ్చకుంటే తప్పుకుంటారు లేదా తప్పిస్తారు. కాబట్టి భారత్‌లో రానున్న పదేళ్లలో ఈ సంఖ్య పెరగొచ్చు. అసలు పెళ్లి చేసుకోవడం కూడా.. ఆప్షనల్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news