మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్..TSRTC సంచలన ప్రకటన

-

మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్..TSRTC సంచలన ప్రకటన చేసింది. ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Big alert for women passengers..TSRTC sensational announcement

తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని చెప్పారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version