కమర్షియల్‌ సిలిండర్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ !

-

కమర్షియల్‌ సిలిండర్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వాడే ఎల్పిజి సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్ల పై ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇచ్చే రాయితీని దేశవ్యాప్తంగా పూర్తిగా ఎత్తివేసారని, ఈ విషయం వినియోగదారులు గ్రహించి సహకరించాలని తెలంగాణ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

gas cylinder prices
gas cylinder prices

గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా నెలకు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వాణిజ్య సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి గతంలో వినియోగదారున్ని బట్టి 100 నుంచి 200 వరకు డిస్కౌంట్ లభిం చేదని దాన్ని పూర్తిగా ఎత్తేసారని తెలిపారు. ఎల్పిజి ప్రమాదాలు ఇటీవల బాగా జరుగుతున్నాయని డిస్ట్రి బ్యూటర్స్ చెప్పే సేఫ్టీ ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ప్రమాదం జరిగితే 40 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇది రావాలంటే డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news