Twitter : ట్విటర్‌లో డిజిటల్ చెల్లింపులు.. మస్క్ నయాప్లాన్

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ విధానం ప్రవేశపెట్టిన మస్క్.. తాజాగా డిజిటల్ పేమెంట్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం ట్విటర్​లో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎలాన్ మస్క్​ స్వయంగా వెల్లడించారు. అడ్వర్టైజర్లతో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పారు మస్క్.

ట్విటర్​ డిజిటల్​ చెల్లింపులకు బాటలు వేస్తుందని అడ్వర్టైజర్లకు వివరించారు మస్క్. బ్లూటిక్​ సబ్​స్క్రైబర్లు క్రిడెట్ కార్డ్ లేదా డెబిట్​ కార్డ్​తోనే సైన్​అప్​ చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దానినే ఇతరులకు నగదు పంపేందుకూ విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ట్విటర్​ ద్వారా యూజర్లు ఇతరులకు డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చని వివరించారు.

బ్యాంకు ఖాతాకు బదులు ట్విటర్​ అకౌంట్​లోనూ నగదు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని, అలా జమ చేసే యూజర్లకు అధిక వడ్డీ కూడా చెల్లిస్తామని తెలిపారు. అలా క్రమంగా డెబిట్ కార్డ్​లు, చెక్​లు జారీ చేసి.. ఈ వ్యవస్థను సాధ్యమైనంతగా విస్తరిస్తామని వివరించారు ఎలాన్ మస్క్. ట్విటర్​ ద్వారా డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పించేలా అనుమతులు ఇవ్వాలని అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ సంస్థలకు ఆ కంపెనీ గత వారమే దరఖాస్తు చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news