తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్.. 50 శాతం రేట్లు పెంపు

-

తెలంగాణ ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సజ్జనర్ ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా నష్టాలను మాత్రం పూడ్చ లేకపోతున్నారు. గత సంవత్సరం జనవరిలో ఆర్టీసీ ఈ 337 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది జనవరిలో 51 కోట్ల ఆదాయం తగ్గి ఆ మొత్తం 287 కోట్లకు పరిమితమైంది. గత డిసెంబర్ మాసంలో ఆదాయం 352 కోట్ల తో పోల్చిన జనవరిలో 65 కోట్ల మేర తగ్గింది.

ఈ తరుణంలో ప్రత్యేక బస్సులు అదనపు చార్జీలు వసూలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలకు హైదరాబాద్ నగరం నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని.. గురువారం ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాల్టి నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అలాగే సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ నెల 13 నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news