బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. ఖమ్మంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరితోపాటు ఆ పార్టీకి చెందిన చాలామంది రాజీనామాలు చేశారు. 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు, ఒక జడ్పిటిసి బిఆర్ఎస్ కి రాజీనామా సమర్పించారు.
వీరు రేపు ఖమ్మంలో జరిగే జనగర్జన బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక పిడమర్తి రవి గత కొంతకాలంగా బిఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికలలో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.