మాజీ మంత్రి మల్లారెడ్డి భూవివాదం కేసులో బిగ్ ట్విస్ట్ !

-

మాజీ మంత్రి మల్లారెడ్డి భూవివాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి భూవివాదం కేసు పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నేడు భూవివాదంలో ఉన్న ల్యాండ్ ను సర్వే చేయనున్నారు అధికారులు. ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించలేదు పోలీసులు. ల్యాండ్ వద్ద టాస్క్ఫోర్స్ మరియు లాండ్ ఆర్డర్ పోలీసులు..మోహరించారు.

Big twist in ex-minister Mallareddy land dispute case

నిన్న ఇరు వర్గాల నుండి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ..ఇరు వర్గాల ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులను నమోదు చేశారు. సర్వే అనంతరం ఎవరి భూమి అని కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక అటు ఈ కేసుపై మల్లారెడ్డి స్పందించారు. నా ల్యాండ్ కబ్జా చేసి నన్నే అరెస్ట్ చేత్తార్రు ఈ రచ్చ ఏంది సామీ.. నేనేడా సూడలా అంటూ మీడియాతో గోడు వెళ్లబోసుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి.

నిన్న రాత్రి 100 మంది ల్యాండ్ దగ్గరకి వచ్చి రచ్చ చేశారు.. అయినా పోలీసులు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు.. ఇగ ఇప్పుడు ల్యాండ్ పేపర్స్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి పోతున్న… కావాలంటే సీఎం దగ్గర కి కూడా రేపు పోతానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news