తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకోవాలంటే ప్రాసెస్‌ ఏంటి..?  

-

నటి జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ బహారియా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకోబోతున్నారు. తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకోవాలంటే ప్రాసెస్‌ ఏంటి, ఏం ఏం పత్రాలు కావాలి చూద్దామా..!
తిరుమలలో వివాహం చేసుకోవడం వల్ల దంపతులకు శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఇక్కడ వివాహాలు ప్రధాన ఆలయం వెలుపల ఒక నిర్దిష్ట ప్రదేశంలో జరుగుతాయి. వివాహానంతరం, నూతన వధూవరులు తమ వివాహ వస్త్రధారణలో ప్రధాన ఆలయంలోని వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.
తిరుపతి ఆలయ సముదాయంలోని కళ్యాణ మండపంలో 50 నుంచి 500 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కానీ పెద్ద వేదికల కోసం మీరు 3 నుండి 6 నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. కళ్యాణ మండపానికి ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ లేదు. తిరుమలలో హిందూ వివాహాలకు మాత్రమే అనుమతి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలి. తిరుపతిలో వివాహానికి వధూవరుల తల్లిదండ్రుల హాజరు అవసరం. తల్లిదండ్రుల అంగీకారంతో తిరుమలలో ప్రేమ వివాహాలకు కూడా అనుమతి ఉంది.
ఒకే సమయంలో అనేక జంటలకు వివాహాలు నిర్వహిస్తారు. ఇక్కడ పెళ్లిళ్లకు ఒకరోజు ముందుగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హాల్ మ్యారేజ్ కోసం, అన్ని పత్రాలను ముందుగానే సమర్పించాలి. పెళ్లి బృందం పూజా సామాగ్రిని స్వయంగా కొనుగోలు చేయాలి.
తిరుపతిలో పెళ్లి చేసుకునేందుకు వధూవరులు ఆధార్ కార్డు నకలుతో పాటు 10వ తరగతి మార్కు పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాన్ని ఆలయానికి సమర్పించాలి. వధువు తల్లిదండ్రులు మరియు వరుడి తల్లిదండ్రుల ఆధార్ కార్డు కాపీని కూడా జతచేయాలి. తల్లిదండ్రులు లేనట్లయితే, వివాహ రిజిస్ట్రేషన్ కోసం తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.
తిరుపతిలో జరిగే వివాహాలకు దేవస్థానం వివాహ ధృవీకరణ పత్రం ఇవ్వదు. కానీ వివాహ రిజిస్ట్రేషన్ రశీదును జారీ చేస్తుంది. వివాహం పూర్తయ్యాక అక్కడి ప్రభుత్వ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేసుకోవాలి. వివాహ నమోదుకు 30 నుండి 45 నిమిషాలు పట్టవచ్చు. వివాహ నమోదుకు వధూవరుల ఆధార్ కార్డు, 10వ తరగతి మార్క్ షీట్ కాపీ లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదా వివాహ ధృవీకరణ పత్రం, వధూవరుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. దీనితో పాటు, ఇద్దరి తల్లిదండ్రుల ఆధార్ కార్డు కాపీ, వివాహ ఆహ్వానం, వివాహ వివరాలతో కూడిన ట్రస్ట్ లెటర్, ముగ్గురు సాక్షులు మరియు వారి ఆధార్ కార్డుల కాపీలు కూడా అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news