అజ్ఞాతంలోకి బిగ్‌బాస్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌

-

పబ్లిక్ న్యూసెన్స్ కు కారణమైన బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులు మూడు బృందాలతో గాలింపు చేపట్టారు. ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకొని అతడి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొల్లూరుకు చెందిన ప్రశాంత్… కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ టీం ను అక్కడకు పంపారు.

Bigg Boss Title Winner Pallavi Prashanth Absconded

కాగా, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్ నిలిచారు. విజేతగా నిలిచినందుకు ఆయనకు రూ. 35 లక్షల ప్రైస్ మనీ దక్కింది. దానితోపాటు రూ. 15 లక్షల విలువ చేసే కారు, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ప్రశాంత్ రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఉండనుంది. ఓవరాల్ గా రూ. కోటి విలువైన సొత్తును ఆయన దక్కించుకున్నారు.అయితే..బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన రైతుబిడ్డ ప్రశాంత్…..తాను గెలిచిన రూ.35 లక్షలను రైతుల కోసమే వినియోగిస్తానని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news